ఏపీలో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో వివిధ కారణాల వల్ల విద్యార్థినీ, విద్యార్ధులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఆహార కారణాలు, జ్వరాల కారణంగా వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని బాలికల గురుకుల పాఠశాలలో 110మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న మొత్తం విద్యార్థులు 413 మంది వున్నారు. చలి, జ్వరం, దగ్గు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు విద్యార్థులు. మూడు రోజుల్లో ఇంటి ముఖం పట్టారు 110 మంది విద్యార్థులు. ఈ విద్యార్ధులకు కోవిడ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. వైరల్ జ్వరాలుగా నిర్ధారించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత కారణమంటున్నారు స్థానికులు.
Read Also: Nirmala Sitaraman: బడ్జెట్ సంగతి ఎలా ఉన్నా.. నేడు నిర్మలమ్మ కట్టే చీరపైనే అందరి కన్ను
ల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణ పురం బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. విద్యార్థుల అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 100 మంది బాలికలు తీవ్ర అస్వస్థత గురైయ్యారు. బాలికలు జ్వరం, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది సృహతప్పి పడిపోయారు. దీంతో బాలికలను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన బాలికలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. తల్లి దండ్రులు ఎవరు భయ పడాల్సిన అవసరం లేదు. గురుకుల పాఠశాలలో అనారోగ్యం పరిస్థితుల నేపథ్యంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది.
Read Also: OLX Layoff : OLXలో ఉద్యోగుల తొలగింపు..1500మందిపై వేటు..!