హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుండాలను, రౌడీలను ప్రోత్సహించి మా నాయకుల మీద దాడి చేయడం జరుగుతుందన్నారు. మా నాయకుడు ఎంపి ప్రభాకర్ మీద భయంకరమైన దాడి చేసారు .గన్ మెన్ లు ఉండబట్టే బ్రతికి ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దాడి ని ప్రజా స్వామ్యవాదులు ఖండించాలన్నారు. రౌడీ ల ద్వారా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ చూస్తుందని ఆయన అన్నారు.
Also Read : Bussiness Idea: కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. నెలకు రూ.30 వేలు మీ సొంతం..
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీకి రౌడీయజం అలవాటే. తెలంగాణ సాధించే క్రమంలో అంబేద్కర్ కళలను నిజం చేసేందుకు దళిత బంద్, బీసి బంద్, రైతులకు రైతు బంద్ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రా రైతాంగం దేశంలో మన్ననలను పొందుతుంది. కర్ణాటక రాష్ట్రము లో గ్యారంటీ లేని పథకాలు ఇచ్చి మోసం చేశారు. గులాబీ జెండా ద్వారానే మా బ్రతుకులు బాగుపడుతాయాని ప్రజలు విశ్వాసిస్తున్నారు. కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. రాబోయే ఎన్నికలలో కచ్చితంగా 100 సిట్లలో గెలువబోతున్నాం, అందులో నేను ఒకడిని.’ అని వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు.
Also Read : Rahul Gandhi : దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరగబోతుంది