Bussiness Idea: కేవలం రూ.5 వేలు ఉంటే చాలు.. నెలకు రూ.30 వేలు మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతి తక్కువ పెట్టుబడితో కొత్తగా బిజినెస్ చెయ్యాలనుకొనే వారికి అదిరిపోయే ఐడియాలు ఉన్నాయి.. రిస్క్ తక్కువగా ఉండే అదిరిపోయే బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రిస్క్ తక్కువ లాభం ఎక్కువగా ఉంటుంది. పుట్టగొడుగుల పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు.. వీటిని పెంచడం కోసం ఎక్కువ శ్రమ పడాల్సిన పనిలేదు.. మీరు కేవలం రూ. 3 నుంచి రూ. 4వేల పెట్టుబడితో, ఒక చిన్న గదితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దేశంలోని దాదాపు అన్ని మధ్యస్థ , పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ వ్యవసాయ సంస్థల నుంచి మీరు దాని సాగులో ఉచిత శిక్షణ తీసుకోవచ్చు.. ఈ వ్యాపారాన్ని ఎలా సాగు చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read
ఒక చిన్న గదిని కలిగి ఉండాలి. వెదురు, పుడకల సహాయంతో ఆ గదిలో బహుళస్థాయి ప్లాట్‌ఫారమ్‌ను తయారు చేయాలి. దీని తరువాత, పుట్టగొడుగుల పెంపకానికి అవసరమైన గడ్డి, కంపోస్ట్ ఎరువును, ఇతర వస్తువులను కలపడం ద్వారా తయారు చేయబడుతుంది. ఇప్పుడు దానిని నీటితో బాగా నానబెట్టి పెద్ద ప్లాస్టిక్ సంచులలో నింపి ఈ ప్లాట్‌ఫారమ్‌లపై ఉంచాలి.. ఇలా మొత్తం సెట్ చెయ్యాలంటే మీకు 3 నుంచి ఐదు వేలు అవసరం అవుతాయి..
రంధ్రాలు చేసి విత్తనాలను సంచులలో ఉంచుతారు. ఆ తర్వాత గదిలోని వాతావరణం దాదాపు చీకటిగా ఉంచాలి. పుట్టగొడుగులు కొద్ది రోజుల్లో పెరగడం మొదలవుతాయి. పుట్టగొడుగుల పంట మూడు నుండి నాలుగు వారాల తర్వాత సిద్ధంగా ఉంటుంది. ఈ పుట్టగొడుగులను చేతితో తీసి ప్యాక్ చేసి మార్కెట్ లో అమ్ముతున్నారు.. ఆ తర్వాత 5 నుంచి ఏడు వారాలకు మళ్లీ కోతకు వస్తాయి.. మార్కెట్ లో ఒకసారి డిమాండ్ పెరిగితే లాభాలు కూడా పెరుగుతాయి..మార్కెట్‌లో కిలో పుట్టగొడుగుల ధర రూ.150 నుంచి 500 రూపాయల వరకు పలుకుతోంది. ఇది పూర్తిగా దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.. నెలకు 20- 30 వేల వరకు సంపాదించుకోవచ్చు..
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!