తమిళ స్టార్ చియన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’. పార్ట్-2’గా రూపొందిన ఈ సినిమాకు ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా.. హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మించింది. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ థ్రిల్లర్ మూవీ తమిళంలో మంచి విజయాన్ని అందుకున్నప్పటికి, తెలుగులో మాత్రం అంతగా రాణించలేకపోయింది. అందులోను ఈ చిత్రం విడుదల రోజే ఓటీటీ హక్కులకు సంబంధించి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంది. లీగల్ సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా మల్టీ ప్లెక్సుల్లో ఫస్ట్ షోలు రద్దయ్యాయి. దీంతో సదరు థియేటర్ల యాజమాన్యం ప్రేక్షకులకు టికెట్ డబ్బులు తిరిగి పంపిస్తామంటూ సందేశాలు పంపించారు. ఆ తర్వాత నిర్మాతలు సమస్యను పరిష్కరించడంతో యదావిధిగా థియేటర్స్‌లో సినిమా స్క్రీనింగ్ జరిగింది. విక్రమ్‌కి జోడిగా దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించగా, తమిళ స్టార్ ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్, సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఇక తాజాగా ఈ చిత్రం థియేటర్లలో విడుదలై నాలుగు వారాల్లోనే ఓటీటీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.
‘వీర ధీర శూర’ పార్ట్-2 ఈ నెల 24 నుంచి ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. ‘ఒక రాత్రి నియమాలు లేవు. మనుగడ మాత్రమే. ప్రతిదీ మార్చే రాత్రి’ అని పేర్కొంది.
One night. No rules. Only survival. A night that will change everything. 🔥#VeeraDheeraSooranOnPrime, April 24 pic.twitter.com/os8pfrjyUJ
— prime video IN (@PrimeVideoIN) April 18, 2025