Vijay Thalapathy: విజయ్ కీలక నిర్ణయం.. ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు!
- విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక
- విజయ్ కీలక నిర్ణయం
- టీవీకే ఏ పార్టీకి మద్దతివ్వదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVK will not support any party in By-Election: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని విజయ్ ముందే చెప్పారు. తమిళనాడులో జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని దళపతి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని టీవీకే మరోసారి స్పష్టం చేసింది. తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదని తమిళగ వెట్రి కళగం తెలిపింది.
తమిళనాడు రాష్ట్రంలోని విక్రవాండి నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతేకాదు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ప్రచారం జరిగింది. దాంతో తమిళగ వెట్రి కళగం నేడు ఓ లేఖ రిలీజ్ చేసింది. ‘తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే ఏ ఎన్నికల్లోనూ పార్టీ పోటీ చేయదు. విక్రవాండి నియోజకవర్గ ఉప ఎన్నిక మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయడం లేదు. అంతేకాదు ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి టీవీకే మద్దతివ్వదు’ అని పేర్కొంది. ఈ ఏడాది ఆరంభంలో విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించి.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
Also Read
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
- CJP Protest: యువతి పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ.. వైద్యులు ఏం చెప్పారంటే..!
- Cockroach Janta Party: సీజేపీకి కోర్టు షాక్.. అత్యవసర విచారణకు నో..
Also Read: Gold Price Today: వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతుందంటే?
ప్రస్తుతం విజయ్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)తో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా.. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
తాజావార్తలు
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
-
Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
-
Delhi: ఢిల్లీలో హై టెన్షన్.. మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన.. సంకెళ్లతో ఆందోళన
-
Aamani : “రేపు నువ్వే హీరోయిన్” అని, కథలు వినటానికి గెస్ట్ హౌస్ లకి రమ్మని చెప్పేవారు!
ట్రెండింగ్
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..