దేశంలోని 20 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లలో వెనుకబడివ వర్గాలు, ఎస్సీలకు కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 60 శాతం భర్తీ కాకుండా మిగిలిపోయాయని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు వి. విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఎస్టీ సామాజికవర్గానికి కేటాయించిన ఫ్యాకల్టీ పోస్టులలో 80 శాతం భర్తీ కాలేదని అన్నారు. ఐఐఎంల బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఐఐఎంలు అన్నింటిలో కలిపి మంజూరు చేసిన పోస్టుల సంఖ్య 1500. అయితే 2023 మార్చి నాటికి వీటిలో భర్తీ చేయని పోస్టులు 500 వరకు ఉన్నాయని అన్నారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలలో సైతం బోధనా సిబ్బంది కొరత ఇలా ఉంటే విద్యార్ధుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించకోవచ్చని అన్నారు. ఐఐఎంలలో ఉన్నక ప్రమాణాలతో విద్యా బోధన జరగాలంటే తగినంత బోధనా సిబ్బంది ఉంటేనే సాధ్యపడుతుందని అన్నారు.
Also Read : Anushka Malhotra: చిరంజీవి రీల్ కూతురు ఏంట్రా.. ఇంత హాట్ గా ఉంది.. ?
గడిచిన పదేళ్ళలో కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు ఐఐఎంలతో కలిపి దేశంలో ఐఐఎంల సంఖ్య 20కి చేరింది. అయితే వీటికి తగినంత బడ్జెట్ కేటాయింపులు జరగడం లేదని శ్రీ విజయసాయి రెడ్డి అన్నారు. ఐఐఎంల సంఖ్య పెరిగే కొద్దీ వాటికి ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ మద్దతు తగ్గుతూ వస్తోందని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐఐఎంలకు 654 కోట్ల రూపాయలు కేటాయించాలని బడ్జెట్‌లో అంచనా వేస్తే. సవరించిన అంచనాల తర్వాత కేటాయించింది 608 కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ కేటాయింపుల్లో సగానికిపైగా కోత విధించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా పరిగణించే ఐఐఎంలకు తగినంత నిధులు కేటాయించి అవి మరింతగా రాణించేలా ప్రోత్సహించాలని ఆయన విద్యా శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే వివిధ విద్యా సంస్థలలో స్థానికతకు ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఐఐఎం ప్రవేశాలలో స్థానికుల కోటాను కూడా ప్రవేశపెట్టాలని విజయసాయి రెడ్డి కోరారు.
Also Read : ChatGPT : చాట్ జీపిటి లో బిగ్ చెంజెస్… వచ్చే వారం మరో కొత్త ఫీచర్స్..