Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Vijayasai Reddy Fires On Janasena And Chandrababu

Vijayasai Reddy: ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు సీట్లే వస్తాయి.. విజయసాయి కీలక వ్యాఖ్యలు

Published Date :March 24, 2024 , 6:26 pm
By Mahesh Jakki
Vijayasai Reddy: ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు సీట్లే వస్తాయి.. విజయసాయి కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijayasai Reddy: నెల్లూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. 2009లో నెల్లూరు లోక్‌సభ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారని.. సొంత ప్రాంతం నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు. తనకున్న అనుభవంతో నెల్లూరు లోక్ సభ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమకు వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Read Also: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌తో పిఠాపురం టీడీపీ నేతల భేటీ.. సీటుపైనే చర్చ!

టీడీపీకి నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థి లేక మా పార్టీ నుంచి తీసుకున్నారు.. ఇది దివాళాకోరుతనం కాదా అంటూ విజయసాయి ప్రశ్నించారు. మా పార్టీ ద్వారా అన్నీ పొంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి, ఇతర నేతలు నైతిక విలువలు పక్కన పెట్టి మాట్లాడుతున్నారన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆ మాటలు ఎన్నికల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయన్నారు. విశాఖ పోర్ట్‌కు మాదక ద్రవ్యాలు కలిగిన కంటైనర్ వస్తే దానిని వైసీపీకి ఆపాదించారని.. సంధ్య ఆక్వా కంపెనీ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలతో వారికి మంచి సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. మాదక ద్రవ్యాల దిగుమతిపై సీబీఐ విచారణ జరుగుతోందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేతను అభినందిస్తూ ట్వీట్ పెట్టాను.. దీంతో తనకు ఆపాదిస్తున్నారని విజయసాయి చెప్పుకొచ్చారు. బ్రెజిల్‌తో మన దేశానికి సత్సంబంధాలు ఉన్నాయన్నారు.

Read Also: Mylavaram Politics: మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు

ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీ.. అందుకే దానికి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు అవసరమైతే పొత్తు పెట్టుకుంటాడు…లేకుంటే తిడతాడంటూ తీవ్రంగా విమర్శించారు విజయసాయి రెడ్డి. బీజేపీ కూడా చంద్రబాబును నమ్మడం లేదన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఆరు అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యల్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. అనైతిక యుద్దాన్ని ప్రారంభించింది టీడీపీనేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కొందరు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • ap news
  • ap politics
  • chandrababu

తాజావార్తలు

  • Pineapple Rava Kesari Recipe: నోట్లో వేస్తే వెన్నెల్లా కరిగిపోయే మౌత్ మెల్టింగ్ ‘పైనాపిల్ రవ్వ కేసరి’ చేసేయండి ఇలా..!

  • UAPA: “దేశానికి వ్యతిరేకంగా యుద్ధం”.. కాశ్మీర్ వేర్పాటువాది ఆసియా అంద్రబీకి జీవితఖైదు..

  • Iran Religious Dictatorship: మానవత్వం ఎక్కడో చచ్చిపోయింది.. మేధావులకు రాజకీయాలే ఎక్కువయ్యాయా?

  • Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

ట్రెండింగ్‌

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions