NTV Telugu Site icon

Vijayasai Reddy: 2027లో జమిలి ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయం

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy: జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఓడిపోయామనే ఆందోళన అవసరం లేదని.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అందరినీ కలుపుకుపోవాలన్నారు. కార్యకర్తలకు వైఎస్ జగన్ అండగా ఉంటారని.. వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటారని అన్నారు. నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. “జమిలి ఎన్నికలు వస్తాయి.. వన్ నేషన్ వన్ ఎలెక్షన్ జరుగుతాయి.. 2027 ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలి. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వస్తాయి..అసెంబ్లీ, ఎంపీ స్థానాలు పెరుగుతాయి.. మూడు స్థానాల్లో ఒక స్థానం మహిళకు వస్తుంది.మహిళలకు వైఎస్ జగన్ తగిన ప్రాధాన్యం ఇస్తారు.. నాకు విశాఖ నుంచి పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీని గెలిపించడమే నా పని.” అని ఆయన అన్నారు.

Read Also: CPI Ramakrishna: సినిమా వాళ్లకు కోట్లు కోట్లు లాభం వచ్చేలా చేస్తారు కానీ.. రైతులను మాత్రం పట్టించుకోరు!

2027లో జమిలి ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు గ్రామాల నుంచి తరిమేస్తున్నారన్నారు. గ్రామాల చివర్లో టెంట్‌లు వేసుకుని వుండే భయానక వాతావరణం సృష్టించారన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో ఈ పరిస్థితి లేదన్నారు. కాకినాడ సీ పోర్టులో కేవీ రావు ఎవరో తెలియకపోయినా తనపై కేసు పెట్టారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చాక ఆ కేసులు తిరిగి వెంటాడుతాయి అని గుర్తు పెట్టుకోవాలన్నారు. అవసరమైతే 3 ,4 నెలలు జైల్లోకి వెళ్ళినా పోరాటం చేస్తామన్నారు. నా మీద లుక్ అవుట్ నోటీస్ ఎందుకు.. మీరు పిలిస్తే నేను సీఐడి ఆఫీస్ కు వస్తా.. అరెస్టు చేసుకోండని వ్యాఖ్యానించారు. బెయిల్ పిటిషన్ కూడా వేయమన్నారు. భయపడేది లేదని.. భయం వైసీపీ నాయకుల రక్తంలో లేదన్నారు. నేను విశాఖలో ఒక్క సెంట్ ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేయలేదన్నారు. బంధువులు కోనుగోలు చేస్తే తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు.. అందుకే ధైర్యంగా వున్నా.. జైలుకి అయినా వెళ్తానన్నారు.

Read Also: AP-Telangana: సన్న ధాన్యంకు బోనస్.. ఆంధ్రా నుంచి తెలంగాణకు భారీగా లారీలు

విద్యుత్ ఒప్పందంలో వైసీపీ ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు. దురుద్దేశంతో కేసు పెట్టారన్నారు. లోకేశ్ అమెరికా వెళ్లి నిరాధార ఆరోపణలకు పథక రచన చేశాడని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వుంది, ఆరోపణలు ప్రూవ్ చేయవచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. భీమిలి తీరంలో మా వియ్యంకులు టీడీపీ ఎంపీ భరత్ తండ్రి వద్దే భూమి కొన్నారు. ఇంకొంత వేరే వాళ్ళ దగ్గర కొన్నారన్నారు. అందులో ప్రభుత్వ భూమి ఇంచు కూడా లేదన్నారు. శారద పీఠంకు మేము భూమి ఇస్తే రద్దు చేశారన్నారు. చంద్రబాబు తన హయాంలో అనేక పీఠాలకు, సంస్థలకు భూములు కేటాయించ లేదా అంటూ ప్రశ్నించారు. 2027లో జమిలి ఎన్నికల్లో పొత్తులపై జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. నాయకుల్ని పోగుట్టుకోమని.. అందరినీ నిలబెట్టుకుంటామన్నారు. జగన్ ఫిబ్రవరి నుంచి ప్రజల్ని, నాయకుల్ని కలుసుకునేందుకు ప్రజల్లోకి వస్తున్నారన్నారు. పార్టీలో పూర్తిస్థాయిలో మార్పులు చూస్తారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్ర మంత్రి కుమార స్వామిని వైసీపీ ఎంపీలం ఇప్పటికే కలిశామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయం అని హామీ ఇచ్చారన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయిం తీసుకున్నా ఉద్యమిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Show comments