జమిలీ ఎన్నికలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల్లో భాగంగా 2027లో ఎన్నికలు వస్తాయని, వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రకు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని.. గత ఎన్నికల్లో ఏ పార్టీ కార్యాలయంగా వేదికగా విజయం సాదించామో మళ్లీ అదే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందంగా ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు