అరుముగ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన తాజా సినిమా ‘ఏస్’. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, దివ్యా పిళ్లై, యోగి బాబు, పృథ్వీరాజ్ తదితరులు నటించారు. ఏస్ చిత్రాన్ని తెలుగులోకి దర్శక, నిర్మాత బి.శివ ప్రసాద్ తన శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద రిలీజ్ చేశారు. మే 23న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. తెలుగులో విజయ్ సేతుపతికి మంచి మార్కెట్ ఉన్నా.. ఏస్ మాత్రం పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.
Also Read: Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ వాయిదా.. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు!
రొమాంటిక్ క్రైమ్ కామెడీగా వచ్చిన ఏస్ సినిమా 20 రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. గత రాత్రి నుంచి సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఏస్ చిత్రాన్ని జూన్ 13న తమిళ్‌తో పాటు తెలుగు వర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వీకెండ్‌లో ఓటీటీలో ఎంచక్కా ఇంట్లోనే ఈ చిత్రాన్ని చూసేయండి. ‘మహారాజా’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ సేతుపతి.. ఆ తర్వాత చేసిన చిత్రమే ఏస్. ఎప్పటికప్పుడు కథలో కొత్తదనం కోరుకునే హీరోల్లో విజయ్ ముందువరుసలో ఉంటాడు.