Kingdom: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఈసారి పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాను తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల కాకముందే, అదికూడా ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కాకముందే.. ‘కింగ్డమ్’ సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లేందుకు సిద్దమవుతుంది. రిలీజ్‌కు రెండు వారాల ముందుగానే, అమెరికాలోని 64 లొకేషన్స్‌లో 135 షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
Read Also:Parliament Sessions: ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సెషన్స్.. 8 బిల్లులను ప్రవేశ పెట్టనున్న మోడీ సర్కార్!
ఇప్పటికే ఈ మూవీకి 15,000 డాలర్లు (అంటే సుమారు 13.63 లక్షలు) విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ స్థాయిలో ఫస్ట్ వీక్ ముందే వసూళ్లు జరగడం సినిమా మీద ఉన్న క్రేజ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ‘కింగ్డమ్’ టీజర్ విడుదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు, టేకింగ్ అన్ని కలిపి సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశాయి. ప్రత్యేకించి యూత్ లో ఈ మూవీపై ఓ స్పెషల్ కనెక్షన్ ఏర్పడింది.
Read Also:Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 31న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మొత్తానికి.. ట్రైలర్ రాకముందే ‘కింగ్డమ్’ యూఎస్ బుకింగ్స్‌లో రికార్డు స్థాయి స్పందన పొందడం, సినిమా మీద ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో ఆసక్తి నెలకొన్నదీ చెప్పకనే చెబుతోంది. విజయ్ దేవరకొండ మళ్లీ మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్నాడా? లేదా అన్నది చూడాలి.