Parliament Sessions: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సెషన్స్ లో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎనిమిది బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఇందులో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనకు సంబంధించిన బిల్లు కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను పొడిగించాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించే ఆలోచన మోడీ సర్కార్ కి లేదని సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన కోసం ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన గడువు ఆగస్టు 13వ తేదీతో ముగిస్తుంది.
Read Also: Jasprit Bumrah: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లిన బూమ్రా..
పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇవే..
* వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025
* పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
* ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025
* పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025
* జియో-హెరిటేజ్ సైట్స్ & జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025
* గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025
* జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025
* జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025