Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!

Ranabaali

Ranabaali

Ranabaali Censor Report: ఈ రోజుల్లో వెండితెరపై కాస్త ఘాటైన సన్నివేశం కనిపించినా, సమాజంలో చర్చనీయాంశమయ్యే అంశాలను టచ్ చేసినా సెన్సార్ కత్తెర పడటం సర్వసాధారణమైపోయింది. అనేక భారీ చిత్రాలు బోర్డు అభ్యంతరాలతో విడుదల ముంగిట తీవ్ర తంటాలు పడుతున్నాయి. అయితే, ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా విజయ్ దేవరకొండ నయా పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ సరికొత్త సంచలనం సృష్టించింది..సినిమాలోని ప్రధాన కథాంశంలో తీవ్ర చర్చకు దారితీసే సున్నితమైన అంశాలు, నాటి చారిత్రక పరిణామాల తాలూకు వివాదాస్పద నేపథ్యం పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే సెన్సార్ అడ్డంకులను ఎలా దాటుతుందోనని ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. కానీ, వాటన్నింటినీ ఆశ్చర్యపరుస్తూ సెన్సార్ అధికారులు ఒక్కటంటే ఒక్క కట్ కూడా సూచించకుండా క్లీన్ U/A సర్టిఫికెట్ జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎంతో సెన్సిటివ్ కంటెంట్ ఉన్నప్పటికీ, దర్శకుడు కథను నడిపించిన విధానం, ఎమోషన్స్ బోర్డును మెప్పించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన రన్‌టైమ్‌ను 2 గంటల 50 నిమిషాలు (170 నిమిషాలు) గా లాక్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగే నిడివి ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసేలా ప్లాన్ చేశారని టాక్. ఎలాంటి కట్స్ లేకుండా, అనుకున్న కథను అనుకున్నట్టే వెండితెరపై చూపేందుకు అనుమతి లభించడంతో దేవరకొండ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. విజయ్ మార్క్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘రణబాలి’ థియేటర్లలో ఏ స్థాయి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. రాహుల్ సంకృత్యాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించింది.