బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ కు చెందిన 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీల పై ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలైన విజయ్ దేవరకొండ పాటు రానా ,మంచు లక్ష్మి ల పై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రకాష్ రాజ్ ,నిధి అగర్వాల్, మంచు లక్ష్మి ,అనన్య నాగళ్ళ, శ్రీముఖిలపై కేసు నమోదు చేయగా ప్రకాష్ రాజ్ ఇటీవల ఈడీ ఎదుట హాజరయ్యాడు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి కేసు విచారణ. సినీ సెలెబ్రెటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లెన్సులపై ..పి ఎం ఎల్ ఏ కింద విచారణ జరుపుతోంది.
ఈ కేసులో గతంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండను విచారణకు రావలసిందిగా ఈడీ నోటీసులు ఇచ్చింది. వివిధ కారణాల వలన అప్పుడు విచారణకు హాజరుకాని విజయ్ దేవరకొండ ఇటీవల మరోసారి నోటీసులు వచ్చిన నేపధ్యంలో ఈ రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. కొద్దీ సేపటి క్రితం విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ఈడీ ప్రారంభమైంది. విజయ్ దేవరకొండ A 23 బెట్టింగ్ యాప్ ను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసాడు. విదేశాల నుండి నిర్వహిస్తున్నఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసేందుకు భారీ పారితోషకం తీసుకున్నాడట. విజయ్ తీసుకున్న పారితోషికం పై ఈడీ ఆరాతీస్తోంది. ఈ నేపథ్యంలో ఐదేళ్ల బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడి ముందు విచారణకు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. విచారణకు హాజరయ్యే సమయంలో టైంపాస్ క్వశ్చన్స్ అడగొద్దు విచారణ తర్వాత అన్ని విషయాలు చెబుతానని మీడియాతో రుసరుసలాడుతూ వెళ్ళాడు విజయ్ దేవరకొండ.