టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా అంతగా హిట్ టాక్ ను అందుకోకపోయిన మంచి కలెక్షన్స్ ను అందుకుంది.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా కూడా పర్వాలేదనిపించింది.. ఇక ఈ సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడని వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
విజయ్ దేవరకొండ ఇంటికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెళ్లడం ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. హైదరాబాదులో ఉన్న విజయ్ దేవరకొండ ఇంట్లో డైరెక్టర్ ప్రశాంత్ కనిపించడంతో కొత్త ఊహగానాలు మొదలయ్యాయి. సోమవారం రోజు రాత్రి ప్రశాంత్ నీల్, విజయ్ దేవరకొండకు మధ్య ఓ మూవీ స్టోరీకి సంబందించిన డిస్కర్షన్ జరిగినట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు ఊపందుకున్నాయి.. ఈ విషయం పై అఫిషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు కానీ ఈ వార్త విన్న విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..
ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ ఖాతాలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, అలాగే ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమాలు అయ్యాకే విజయ్ తో సినిమా చేస్తాడేమో అనే టాక్ వినిపిస్తుంది.. ప్రశాంత్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాలని కోరుకుంటున్నారు.. ఏది ఏమైనా ఈ కాంబో మాత్రం అదిరింది.. ఈ గుడ్ న్యూస్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపైనే ఆయన ఆశలన్నీ ఉన్నాయి.. ఈ సినిమా త్వరగా పూర్తి చేసి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..