Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.తాను నటించిన “ఫ్యామిలీ స్టార్” మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు .కానీ ఆ సినిమా ఓటిటిలో మాత్రం అదరగొడుతుంది.ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ లో మూడు భారీ సినిమాలు వున్నాయి.ఈ మూడు సినిమాలు కూడా పాన్ఇండియా సినిమాలు కావడం విశేషం . ఇటీవల విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Read Also :Kajal Aggarwal : అందుకే నేను తెలుగులో ఎక్కువగా మాట్లాడను..
ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. గత కొన్నిరోజులుగా ఈ సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా స్పై థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ వైజాగ్ లో తన అభిమానులతో సందడి చేసారు.విజయ్ ను కలిసేందుకు అభిమానులు ఎగబడ్డారు.ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .