విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’ నేడు ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.గత సంవత్సరం ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన ‘లైగర్’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఖుషి మూవీపైనే విజయ్ దేవరకొండ భారీగా ఆశలు పెట్టుకున్నాడు.అయితే ఖుషి సినిమా ఫీల్ గుడ్ మూవీ గా రిలీజ్ కు ముందే ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి కలిగించింది. ఎలాంటి హడావుడి లేకుండా విడుదల అయిన ఖుషి సినిమా అందుకు తగ్గట్లే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా కథ ఏమిటంటే విప్లవ్(విజయ్ దేవరకొండ) బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. కావాలని మరీ కశ్మీర్ లో పోస్టింగ్ వేయించుకుంటాడు. అక్కడే ఆరా బేగం(సమంత)ని చూసి ప్రేమలో పడతాడు. కొన్నాళ్లకు ఆమె కూడా విప్లవ్ ని ప్రేమిస్తుంది. ట్రైలర్ లో చూపించిన విధంగా తాను ముస్లిం కాదని హిందూ అని చెబుతుంది. తన తండ్రి, కుటుంబం వివరాలు చెబుతుంది. అయితే వారు పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. దీనితో వారి వివాహ జీవితం ఎలా సాగింది అనేది మిగతా స్టోరీ.
దర్శకుడు శివ నిర్వాణ తెలిసిన కథ అయినా కూడా ఎంతో అద్భుతంగా చూపించాడు. విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.తాజాగా విజయ్ దేవరకొండ మూవీ రిజల్ట్ పై ఫస్ట్ రియాక్షన్ ఇచ్చేశాడు. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.అయితే ఓవర్సీస్ లో నిన్న అర్ధ రాత్రి ‘ఖుషి’ మూవీ ప్రీమియర్స్ వేయడం జరిగింది.ఈ క్రమంలోనే ఉదయం లేచేసరికే విజయ్ కి బోలెడన్ని కాల్స్, మెసేజులు వచ్చాయటా.దీంతో ఎమోషనల్ అవుతూ విజయ్ ట్వీట్ చేశాడు. ‘నాతో పాటు మీరు ఐదేళ్లుగా ఎంతగానో ఎదురుచూశారు. నాకోసం ఎంతో సహనంగా వెయిట్ చేశారు. మొత్తానికి ఈ రోజు మనం సాధించాం. వందల ఫోన్లు, మెసేజులతో నేను నిద్రలేచాను. కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. లవ్ యూ ఆల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ విజయ్ దేవరకొండ’ అని ట్విట్టర్ ద్వారా స్పందించారు
https://twitter.com/TheDeverakonda/status/1697463054244684128?s=20