Vijay Devarakonda : విభిన్న కథాంశం తో రాబోతున్న విజయ్ దేవరకొండ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన చిత్రం చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. మరో సారి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నటించనున్నాడు.. గతంలో విజయ్ – రాహుల్ కాంబినేషన్లో టాక్సీవాలా తెరకెక్కి మంచి విజయం సాధించింది. వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది.రాహుల్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేయనున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనుందని సమాచారం.. అలాగే, ఇది పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఉండనుందని సమాచారం.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ పనులను రాహుల్ ఇప్పటికే చివరి దశకు తెచ్చినట్టు సమాచారం.విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యన్ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి మూవీ పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ.. రాహుల్ మూవీని మొదలుపెడతారని సమాచారం.
విజయ్ – రాహుల్ కాంబినేషన్లో 2018లో ట్యాక్సీవాలా సినిమా వచ్చింది. సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది.పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ఇది లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది.. ఇక గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ చేస్తున్న సినిమా ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది.. వచ్చే ఏడాది వేసవికి ఈ మూవీ రిలీజ్‌ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.ఇటీవల విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన ఖుషి మూవీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అంతగా ఆడలేదు.. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. దీనితో తరువాత సినిమాల పై విజయ్ పూర్తి దృష్టి పెట్టాడు.
Also Read
- Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా 'వెజ్ సూప్' ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
- Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
తాజావార్తలు
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
-
Kaushik Reddy: కౌశిక్ రెడ్డి ఎపిసోడ్‌పై ముగిసిన ఎథిక్స్ కమిటీ సమావేశం..!
-
RC17 : అక్టోబర్ 20న సుకుమార్ – రామ్ చరణ్ సినిమా పూజా కార్యక్రమం
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!