బిచ్చగాడు-2 సినిమాపై నటుడు విజయ్ ఆంటోని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాజాగా నటించిన పిచ్చైక్కారన్ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఆ చిత్రానికి సీక్వెల్ గా పిచ్చైక్కారన్-2 ( తెలుగు వర్షన్ బిచ్చగాడు-2 ) సినిమాన్ని సొంతంగా నిర్మించి.. సంగీతాన్ని అందించి, హీరోగా కూడా నటించారు.
Also Read : Bommireddy Raghavendra Reddy: నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్..! వైసీపీలో చేరనున్న సీనియర్ నేత..
ఇందులో విశేషమేమిటంటే ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా మారాడు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. రాధారవి, వైజీ.మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీశ్ పేరడి, జాన్స్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి ఓమ్ నారాయణన్ ఛాయగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
Also Read : Ward system: హైదరాబాద్‌లో వార్డ్ పాలన.. మంత్రి కేటీఆర్ వెల్లడి
ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ టైంలో ప్రమాదానికి గురైన తాను ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సాధారణంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయని.. తనకు మాత్రం పాటలు షూట్ చేస్తుంటే ప్రమాదం జరిగిందని చెప్పారు.
Also Read : Cognizant: లేఆఫ్స్ జాబితాలోకి మరో టెక్ దిగ్గజం.. 3,500 మంది తొలగింపు..
తాను సంగీతదర్శకుడిగానూ ఎవరి వద్దా పని చేయలేదనీ.. సినిమాలు చూసిన అనుభవమే అని అన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ.. ఇంతకు ముందు చిత్రాల్లో తనకు రొమాన్స్ సన్నివేశాలు పెద్దగా లేవనేవారనీ.. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని విజయ్ ఆంటోని చెప్పుకొచ్చారు. ఇది అన్నా, చెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని విజయ్ ఆంటోని అన్నారు.