Site icon NTV Telugu

SSMB28 : మహేశ్‌ అభిమానులకు అప్పుడే పూనకాలు షురూ.. త్రివిక్రమ్‌ సినిమా నుంచి వీడియో రిలీజ్‌..

Ssmb 28

Ssmb 28

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంగతి అలా ఉంటే.. ఇక ఆయన అభిమానుల సంగతి ఇంకేం చెబుతాం. మహేశ్‌బాబు పుట్టిన రోజైన.. ఆయన సినిమా ప్రీ రిలీజ్‌, రిలీజ్‌ ఇలాం ఒక్కటేంటి ఏ కార్యక్రమమైనా తమ స్టైల్‌లో సోషల్‌ మీడియాల్లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు మహేశ్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మహేశ్‌28వ సినిమా తెరకెక్కుతోంది. అయితే.. ఇలా ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారో లేదో.. అప్పుడే ఈ సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. #SSMB28 Filming Begins పేరిట ఈ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో గన్, పోలీస్ స్టార్స్ ని చూడవచ్చు, అలానే వీడియోలో మహేష్ బాబు పవర్ఫుల్ కళ్ళ లుక్ ని కూడా చూపించారు. అయితే.. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.

 

ఈ చిత్రంలో మహేశ్‌కు సరసన మరోసారి పూజా హెగ్దే నటించనుంది. ఈ సినిమాకు ఎస్‌ఎస్‌ థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, మహేశ్‌బాబు కాంబోలో ఈ సినిమా మూడవది. అయితే మొదటి సినిమా అతడు బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలువగా.. ఖలేజా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు మూడో సారి వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాల ఉన్నాయి మరీ.

 

Exit mobile version