NTV Telugu Site icon

Sankranthiki Vasthunnam: జోరుమీదున్న వెంకీ మామ..200 కోట్లకు చేరువగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్స్

Sankarnthiki Vasthunnam 20

Sankarnthiki Vasthunnam 20

Sankranthiki Vasthunnam: సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, సినిమాలు ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఈ నేపథంలో అన్ని వర్గాల నుంచి సూపర్ టాక్ తెచ్చుకున్న సంక్రాంతికి వస్తున్నాం, దాకు మహారాజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వసూళ్లను రాబడుతున్నారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా వసూళ్లను రాబడుతున్నారు ఈ సీనియర్ హీరోలు. ఇకపోతే, సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ హీట్ సాధించింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, విక్టరీ వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుసగా మూడో సినిమా హిట్ సాధించింది.

Also Read: Varun Tej VT15: హారర్ కామెడీతో మెప్పించడానికి సిద్ధమైన వరుణ్ తేజ్.. పుట్టినరోజు నాడు కొత్త సినిమా అనౌన్స్..

మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇల్లు హీరోయిన్ల గా నటించగా.. మురళీధర్ గౌడ్, నరేష్, అవసరాల శ్రీనివాస్ ఇతరుల పాత్రలో నటించి మెప్పించారు. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ ఆయన మొదటి రోజు నుంచే భారీ హిట్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే వసూలను రాబడుతోంది. ఈ సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి హీరో విక్టరీ వెంకటేష్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమాల నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా విడుదలయ్యి ఐదు రోజుల కలెక్షన్లకు సంబంధించి చిత్ర బృందం వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఐదు రోజుల్లో 161 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లుగా మూవీ యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

ఈ వసూళ్లు వెంకటేష్ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ కలెక్షన్లుగా నిలుస్తోంది. ఈ దూకుడు చూస్తుంటే అతి త్వరలో 200 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్లు బాలయ్య హీరోగా నటించిన డాకు మహారాజ్ కలెక్షన్లను కూడా దాటేసింది. ఇప్పటివరకు డాకు మహారాజ్ కేవలం 150 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేయగా.. వెంకీ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 161 కోట్లతో సంక్రాంతి కలెక్షన్లలో ముందు వరుసలో నిలిచింది. కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఏకంగా రెండు మిలియన్ డాలర్స్ వైపు వసూలను రాబట్టేందుకు పరుగులు పెడుతోంది. నేడు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరగనున్నాయి.