Site icon NTV Telugu

Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..

Gurumurthy

Gurumurthy

తెలుగు రాష్ట్రాల్లో మీర్‌పేట్ హత్య కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే.. కాగా భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి చంపినట్లు నిన్న పోలీసులు నిర్ధారించారు. సంక్రాంతి రోజు భార్య మాధవితో గొడవపడి దాడి చేశాడు. ఈ దాడిలో వెంకట మాధవి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో.. స్పృహ లేకుండా పడిపోయిన మాధవిని ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు గురుమూర్తి. ఈ హత్యకు సంబంధించి నిందితుడు గురుమూర్తి పోలీసులకు చెప్పిన విషయాలు వణుకు పుట్టించాయి.

Read Also: CM Chandrababu: పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్..

కాగా.. భార్య వెంకట మాధవి హత్య కేసులో నిందితుడు భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకట మాధవిని గురుమూర్తి కిరాతకంగా హత్య చేసి.. ముక్కలుగా చేశాడు. అంతేకాకుండా.. భార్య మృతదేహం ముక్కలను వాటర్ హీటర్‌లో వేసి ఉడకపెట్టాడు. మృతదేహం ముక్కలు ఉడికిన తర్వాత కమర్షియల్ స్టవ్ పైన పెట్టి కాల్చాడు నిందితుడు గురుమూర్తి.. బాగా కాలిపోయిన ఎముకల్ని పొడిగా చేసి చెరువులో కలిపేశాడు. అయితే.. తన కూతురు కనపడటం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. దర్యాప్తు చేపట్టగా ఇంతటి సినిమా బయటపడింది. కాగా.. ఈ హత్య కేసులో సాంకేతిక ఆధారాలతో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు గురుమూర్తిని సాయంత్రం ఐదు గంటలకు పోలీసులు మీడియా ముందు హాజరు పరుచనున్నారు. ఇదిలా ఉంటే.. మీర్‌పేట్‌లోని ఇంటికి నిందితుడు గురుమూర్తిని తీసుకు వచ్చారు పోలీసులు. ఇంట్లో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్లూస్ టీం సహాయంతో మీర్‌పేట్ పోలీసులు మరికొన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.

Read Also: Gorantla Butchaiah Chowdary: విజయసాయిరెడ్డిని కూటమిలో చేర్చుకోవడానికి వీల్లేదు.. సీనియర్‌ నేత డిమాండ్‌

Exit mobile version