Site icon NTV Telugu

Vemula Prashanth Reddy : ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను విడుదల చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy

Vemula Prashanth Reddy

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలురులో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు అర్దరహిత విమర్శలు మాని.. ఇక్కడికి వచ్చి కాళేశ్వర జలాలు చూడాలన్నారు. కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా రైతుల పంట పొలాలకు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఆయన కొనియాడారు. 20,21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటి ఇంటికి తాగు నీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వు ను ఏర్పాటు చేస్తామన్నారు. ఔట్ లెట్ కు అవసరమయ్యే పైపు లైను వేసేందుకు రైతులు సహకరించాలని ఆయన కోరారు.

Also Read : Panchakarla Ramesh Babu: ఈ నెల 20న సాయంత్రం జనసేనలో చేరుతా..

కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ నుంచి పైపు లైన్ల ద్వారా పంపు హౌజ్ నుంచి 20వ ప్యాకేజీ తో నీళ్లు తీసుకొచ్చామని తెలిపారు. అర్థం లేని ఆరోపలు చేసే ప్రతిపక్షాలకు ఇక్కడికి వచ్చిన నీళ్లే అందుకు సరైన సమాధానం చెబుతాయని అన్నారు. వట్టిపోయిన వాగులు జలకళ సంతరించున్నాయని తెలిపారు. వాగులోకి వస్తున్న నీటిని చూసి సీఎం కేసీఆర్ ను ప్రజలు మనసారా ఆశీర్వదించాలని కోరారు. 20, 21 ప్యాకేజీల ద్వారా వచ్చే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, తాము ఇచ్చిన మాట మేరకు 20, 21 ప్యాకేజీల నీటిని తీసుకువచ్చామన్నారు. భగీరథ ద్వారా ఇంటిఇంటికీ తాగునీరు ఇచ్చినట్లు ప్రతి మూడు ఎకరాలకు ఒక అవుట్ లేట్ వాల్వును ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Abhishek Bachchan: పాలిటిక్స్ లోకి అభిషేక్ బచ్చన్..ఆ పార్టీ నుంచే ఎంపీగా పోటి..

Exit mobile version