బాలివుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలి నుంచి మరొకరు రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు గత కొన్నేళ్లుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే అమితాబ్ తో పాటు.. ఆయన భార్య జయా బచ్చన్ కూడా పాలిటిక్స్ లో ఉండగా.. తాజాగా హీరో అభిషేక్ బచ్చన్ కూడా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు..నటుడు అభిషేక్ రాజకీయ ఆరంగేట్రానికి సిద్దం అవుతున్నారు. సీనీరాజకీయ వర్గాల నుంచి అందుతున్నసమాచారం ప్రకారం బచ్చన్ ఫ్యామిలీ వారసత్వం తీసుకున్న అభిశేక్ హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేకపోయాడు. ఇక ఇప్పుడు వారి రాజకీయ వారసత్వాన్ని పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పుడు ఎంపీగా పోటి చేయబోతున్నట్లు సమాచారం..
అభిషేక్ బచ్చన్ సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని సమాచారం. అభిషేక్ బచ్చన్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో కాంగ్రెస్ తరపున ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు… ఇక అభిషేక్ ను కూడా రాజకీయ వారసుడుగా ఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నారు..
ఇకపోతే అభిషేక్ తల్లి జయా బచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. అంతే కాదు జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంట్ లో ఉన్నారు. దీంతో, అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు అనుుకుంటున్నారట. అభిషేక్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడలేక పోయారు. దాంతో రాజకీయంగా అయినా తనేంటో నిరూపించుకుని గొప్ప నాయకుడు అవుతారని అందరు అభిప్రాయపడుతున్నారు.. దీనిపై సోషల్ మీడియాలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అభిషేక్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.. ప్రస్తుతం అమితాబ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు..