ఓవర్ నైట్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా సరైన హిట్ ఖాతాలో వేసుకోలేదు.. ఇటీవల విడుదలైన లైగర్ సినిమా ఆశించిన హిట్ ను అందుకోలేదు.. తాజాగా ఆయన ఖుషి సినిమాలో నటిస్తున్నాడు.. ‘ఖుషి’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసిన విజయ్ దేవరకొండ ఆ వెంటనే తన కొత్త సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాడు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది… గీత గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. VD13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. సీతారామం సినిమాతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది..
ఇకపోతే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వాసు వర్మ ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న 54వ సినిమా ఇది. తాజాగా చిత్ర బృందం ఆసక్తికరమైన అప్‌డేట్‌ను పంచుకుంది. ఈచిత్ర షూటింగ్ ఈ రోజు ప్రారంభమైనట్లు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. ‘మా #VD13 #SVC54 షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. సంక్రాంతి 2024కి సరైన ఎంటర్‌టైనర్‌గా మీకు హామీ ఇస్తున్నాము.’ అంటూఆ పోస్టర్ పై రాసుకొచ్చారు..
ఇది ఇలా ఉండగా.. విజయ్, సామ్ నటించిన ఖుషి సినిమా ఈరోజే షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 1న ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లేలా విజయ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది..
The shoot of our #VD13 #SVC54 kick started today!🤩
Promising you a perfect entertainer for Sankranthi 2024.❤️🔥@TheDeverakonda #MrunalThakur @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/wEBkpqDROv
— Sri Venkateswara Creations (@SVC_official) July 15, 2023