VD Satheesan: ‘సీఎం ఇలా ఏడవకూడదు..’ గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VD Satheesan: కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న కాంగ్రెస్ నేత ‘వీడీ సతీశన్’ భావోద్వేగానికి గురైన ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన రాజకీయ గురువుగా భావించే దివంగత కాంగ్రెస్ దిగ్గజ నేత కార్తికేయన్ కుటుంబ సభ్యులను తిరువనంతపురంలో శుక్రవారం కలిసిన సతీసన్, ఆయన భార్యను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా కార్తికేయన్ భార్య కూడా భావోద్వేగానికి లోనయ్యారు. వీడీ సతీశన్ ను ఓదారుస్తూ “ఒక సీఎం ఇలా ఏడవకూడదు” అని చెప్పిన మాటలు అక్కడ ఉన్నవారిని కదిలించాయి. గురువు కుటుంబంపై సతీశన్ కు ఎంత ఆప్యాయత, గౌరవం ఉందో ఈ ఘటన ద్వారా స్పష్టమైంది. ఇదిలా ఉండగా, సతీసన్ సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ ను కూడా కలిశారు. సీఎం అభ్యర్థిత్వం తనకు దక్కకపోవడంపై చాలా అసంతృప్తిగా ఉన్నారనే వార్తల మధ్య ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
- Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
- Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సతీశన్, “రమేశ్ మా నాయకుడు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆయన నాకు మార్గదర్శకుడు. ఇప్పుడు కూడా ఆయనే నా నాయకుడు. ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికే వచ్చాను. ఆయన మద్దతు ఎప్పుడూ నాతో ఉంటుంది” అని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కూడా సతీశన్ ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ భేదాలు అడ్డుకావొద్దని వ్యాఖ్యానించారు.
పినరయి విజయన్ కేరళ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు. ప్రతి అంశంలో మేము ఏకీభవించకపోయినా, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగిస్తాం. ఒక ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను మరో ప్రభుత్వం రద్దు చేస్తే రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది? అని సతీసన్ పేర్కొన్నారు. కాగా, వీడీ సతీసన్ సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురంలోని లోక్ భవన్ లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) 140 స్థానాల్లో 102 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. దీంతో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ముగింపు పలికింది.
#WATCH | Keralam CM-designate VD Satheeshan visits the residence of late Congress leader G Karthikeyan, in Thiruvananthapuram, and meets his family.
(Video Source: Keralam CMO) pic.twitter.com/XWbYak7LYs
— ANI (@ANI) May 15, 2026
తాజావార్తలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
-
DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
-
Nani The Paradise Box Office: ‘ది ప్యారడైజ్’ రికార్డు.. నాని కెరీర్లో ఫాస్టెస్ట్ రూ.100 కోట్ల సినిమా..!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!