Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Vc Sajjanar Warns About Attacks On Rtc Staff

VC Sajjanar : దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Published Date :February 7, 2024 , 5:41 pm
By Gogikar Sai Krishna
VC Sajjanar : దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దుండగుల చేతిలో దాడికి గురైన టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వీసీ సజ్జనర్, ఐపీఎస్ పరామర్శించారు. హైదరాబాద్ తార్నాకలోని టీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని బుధవారం ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితితో పాటు దాడి జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ కండక్టర్, డ్రైవర్ కు టీఎస్ఆర్టీసీ పూర్తిగా అండగా ఉంటుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని సజ్జనర్ వారికి భరోసా కల్పించారు. దాడిలో గాయాలైన కండక్టర్ రమేష్ కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

ఫరూక్ నగర్ డిపోనకు చెందిన 8ఏ రూట్ బస్సులో విధులు నిర్వర్తిస్తోన్న డ్రైవర్, కండక్టర్ పై ఇద్దరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. తమ తప్పు లేకున్నా బస్సును రోడ్డుపై ఆపి క్రికెట్ బ్యాట్ తో వారిని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్, డ్రైవర్ షేక్ అబ్దుల్ కి గాయాలయ్యాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఈ నెల 4న జరిగిందీ సంఘటన. 

Also Read

  • చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!
  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
  • Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
Add as a preferred
source on google

ఈ ప్రమాదంలో తమ సిబ్బంది ఎలాంటి తప్పులేదని, ఉద్దేశపూర్వకంగా సిబ్బందిపై దుండగులు దాడికి పాల్పడ్డారని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయగానే.. హైదరాబాద్ కమిషనరేట్ దోమల్ గూడ పోలీసులు వెంటనే స్పందించారని చెప్పారు. కేసు నమోదు చేసి.. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీంలను సోమవారం అరెస్ట్ చేశారని వివరించారు. 

ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. నిబద్దత, క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న సిబ్బందిపై క్రికెట్‌ బ్యాట్‌ తో దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామన్నారు. తమ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.  బాధితులను పరామర్శించిన వారిలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ రవిందర్, ఈడీలు కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, తార్నాక ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శైలజామూర్తి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి ఓఎస్డీ సైది రెడ్డి, తదితరులు ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • TSRTC
  • VC Sajjanar

తాజావార్తలు

  • TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?

  • చివరి బంతి థ్రిల్లర్ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న Krunal Pandya..!

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions