Varun Gandhi: బీజేపీకి షాక్.. త్వరలో కాంగ్రెస్ లోకి వరుణ్ గాంధీ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi: ఇందిరాగాంధీ మనుమడు, మేనకా- సంజయ్ గాంధీల వారసుడు వరుణ్ గాంధీ బీజేపీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావాలనే డిమాండ్లు జోరుగా వస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు, కింది స్థాయి నేతలు తరచుగా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఈ విషయమై పదే పదే కోరుతున్నారు. గత కొంతకాలంగా అడపాదడపా సొంత పార్టీ బీజేపీ పైనే ఆయన విమర్శలు ఎక్కుపెట్టడం, మోదీ ప్రభుత్వ విధానాలను విమర్శించడమే దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
Read Also: Russian Ukrainian War: ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 600మంది ఉక్రెయిన్ల హతం
Also Read
- Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
తాను కాంగ్రెస్ కు వ్యతిరేకం కాదని మన రాజకీయాల లక్ష్యం ప్రజలను కలిపి ఉంచేలా ఉండాలేగానీ, అంతర్గత యుద్ధాన్ని ప్రేరేపించేలా ఉండకూడదు. మతం, కులం పేరిట ఓట్లు అడుగుతున్నవారిని.. ఉపాధి, విద్య, ఆరోగ్యం వంటి తీవ్రమైన అంశాలపై మీరు ఏం చేస్తున్నారని ప్రజలు అడగాల్సి ఉందంటూ తన నియోజకవర్గ(ఫిలిబిత్) ప్రజలను ఉద్దేశించి వరుణ్‌గాంధీ వ్యాఖ్యానించారు. ఇవి సొంత పార్టీని ఉద్దేశించి మాట్లాడినట్లు ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వరుణ్ గాంధీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలంటూ డిమాండ్ చేసారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం యూపీలోని సుల్తాన్ పూర్ ఎంపీగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో కుదేలైన కాంగ్రెస్ కు పునర్వైభవం దక్కాలంటే వరుణ్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని ఉమేష్ పండిట్ అనే యూపీ నేత కోరారు.
Read Also: Adilabad Safe District: ఆదిలాబాద్.. దేశంలోనే సురక్షితమయిన జిల్లా
వరుణ్ తల్లి మేనకాగాంధీకి 2019లో తిరిగి మోదీ కేబినెట్లో స్థానం కల్పించనప్పుడే ఆయన అసమ్మతి బయటపడింది. ఆ సమయంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి కూడా ఇద్దరినీ(మేనక, వరుణ్‌లను) పక్కన పెట్టారు. వాజపేయి-ఆడ్వాణీల హయాంలో వరుణ్, ఆయన తల్లి మేనకాగాంధీకి బీజేపీలో మంచి ప్రాధాన్యం లభించింది. రాజ్‌నాథ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతి చిన్న వయసులోనే ప్రధాన కార్యదర్శిగానూ వరుణ్ నియమితులయ్యారు. అయితే, అమిత్‌షా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తల్లీ, కొడుకుల రెక్కలు కత్తిరించడం ప్రారంభమైంది. అమిత్‌షా హయాంలోనే వరుణ్‌ను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. మోదీ-అమిత్‌షాల హయాంలో ఇక తమకు పార్టీలో భవిష్యత్తు ఉండదని వరుణ్‌గాంధీ భావిస్తున్నారు. దీంతో ఆయన బీజేపీని వీడి, కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Google Top Employer: భారత్‌లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్‌కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్‌కు అలా కలిసి వచ్చిందా?
-
Chandini Chowdary: “ఆ రోజు నన్ను పడుకోమని అడిగింది మీరే కదా!” అంటే ఆయన ముఖం మాడిపోయింది!
-
YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!