NTV Telugu Site icon

Varla Ramaiah: డీజీపీకి నైతిక విలువలు ఉంటే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి..

ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ వారు అపాయింట్ మెంట్ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు, ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.

Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు

వ్యూహం సినిమా డైరెక్టర్ సభ్యతా సంస్కారాలు లేని రాంగోపాల్ వర్మ అపాయింట్ మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లకు దున్నపోతు తలలు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తికి సాదర గౌరవమిస్తారా? అని దుయ్యబట్టారు. డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని ఆయన కోరారు. కడుపు మండి కామెంట్ చేసిన యువకుడిని కాకుండా.. పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాలన్నారు. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమాను విడుదల కానీయరాదన్నారు.

UP Shocker: పాటలు వినడానికి మొబైల్‌ అడిగినందుకు.. భర్త కంట్లో కత్తెరతో పొడిచేసిన భార్య

డీజీపీ వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయాలని వర్ల రామయ్య తెలిపారు. డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి ఏకపక్ష వైఖరిని డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా చూడాలన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే ‘‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అనడం చట్టాలను శాసించేలా ఉందని తెలిపారు. అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్ చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకులకు మీ ఆఫీసులో ప్రవేశం లేదా? వైసీపీ సభ్యత్వం ఉంటేనే రానిస్తారా? అని ప్రశ్నించారు. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలని తెలిపారు. డీజీపీ మీ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిందని ఆరోపించారు. తాను ఫ్యాక్షనిస్టుగా మారుతానన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వెంటనే అరెస్టు చేసి బైండోవర్ చేయాలని వర్ల రామయ్య కోరారు.