Manchester Flight Incident: గాల్లో ఉన్న విమానంలో ఒక్కసారిగా కుదుపులు.. 11 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాల్లో ఉండగానే విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవ్వడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసర పరిస్థితిలో ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంఘటనలో 11 మంది ప్రయాణికులు గాయపడగా.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎయిర్‌పోర్టు అధారిటీ పేర్కొంది. ఆదివారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Also Read
వివరాలు.. కరేబియన్ ద్వీపంలోని బార్బడోస్ నుంచి మాంచెస్టర్‌కు మలెత్ ఏరో ఫ్లయిట్ బయలుదేరింది. డిసెంబర్ 24న 225 మంది ప్రయాణికులతో కరేబియన్ ద్వీపం బార్బడోస్ నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరింది. ఉదయం 6 గంటలలోపు మాంచెస్టర్‌కు చేరుకోవాల్సి ఉండగా.. బయలుదేరిన రెండు గంటల తర్వాత విమానంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో 38,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఈ ఎయిర్‌బస్ విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో పైలెట్లు విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కోసం దగ్గర్లోని బెర్మాడాకు మళ్లీంచారు. అక్కడ విమానం ల్యాండ్ అవుతుండగా 11 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరికి బర్ముడాలో చికిత్స అందించారు. అయితే సిబ్బందికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
Also Read: Prof. Aditya Mukherjee : మతోన్మాద శక్తులు నెహ్రూపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!