ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డికి హైదరాబాద్‌లో ఒక ఊహించని పరిస్థితి ఎదురైంది. శనివారం రాత్రి హైటెక్ సిటీలోని ప్రసిద్ధ నిలోఫర్ కేఫ్‌కు టీ కోసం వెళ్లిన ఈ స్టార్ దంపతులను అభిమానులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం జనం ఎగబడటంతో పరిస్థితి అదుపు తప్పింది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో బన్నీ తన భార్య స్నేహారెడ్డి చేయి గట్టిగా పట్టుకొని, జనాల మధ్య నుంచి అతి కష్టం మీద దారి చేసుకుంటూ కారు వరకు వెళ్లాల్సి వచ్చింది. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్న జనం తోసుకురావడంతో బన్నీ స్వయంగా ‘పక్కకు జరగండి’ అని కోరాల్సి వచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా అభిమానులు ప్రవర్తించడంపై నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read : Nayanthara: చిరు మూవీతో.. కొత్త వివాదంలో చిక్కుకున్న నయనతార
మరోవైపు, ఇదే రోజున అల్లు అర్జున్ తన కలల ప్రాజెక్టు ‘అల్లు సినిమాస్’ (Allu Cinemas) సాఫ్ట్ లాంచ్‌ను కోకాపేటలో ఘనంగా నిర్వహించారు. తన కుమారుడు అయాన్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ, ఆసియాలోనే అత్యున్నత సాంకేతికత కలిగిన థియేటర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. ఈ థియేటర్‌లో డాల్బీ సినిమా ఫార్మాట్‌తో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి. థియేటర్ లోపల అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ మరియు మెగాస్టార్ చిరంజీవి చిత్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం మెగా మరియు అల్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలోఫర్ కేఫ్ వద్ద జరిగిన ఘటన మినహా, అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.