వైఎస్‌ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని వనిపెంట గురుకుల పాఠశాలలో ఓ మహిళా టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రిన్సిపల్ మేడమ్ నిర్మల వేధింపులు తాను భరించలేనని బయాలజీ టీచర్ జ్యోతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. సకాలంలో తోటి టీచర్స్ చూడడంతో.. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టీచర్ జ్యోతిని మెరుగైన వైద్యం కోసం కడపకి తరలించారు. టీచర్ జ్యోతి తన ఆత్మహత్యకు గల కారణాలను లేఖలో రాశారు. వనిపెంట గురుకుల పాఠశాలలో జరిగే విషయాలు అన్నింటినీ చెప్పి.. ప్రిన్సిపల్ నిర్మలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
‘నా పేరు జ్యోతి. నేను వనిపెంట గురుకుల పాఠశాలలో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్నాను. 8 సంవత్సరాలు నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాను. జూన్ 2025 నుంచి స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల నన్ను టార్చర్ చేస్తున్నారు. నాకు మూడు నెలల పాప ఉంది, అయినా నేను అన్ని క్లాసెస్ హాజరై విధులు నిర్వహిస్తున్నా. నా మరణానికి కారణం ప్రిన్సిపల్ మేడం నిర్మల. బయాలజీ సరిగా చెప్పలేను అని నామీద నిందలు వేశారు. నేను చెప్పనప్పుడు ఆరు క్లాసెస్ ఎందుకు ఇచ్చారు. స్కూల్లో జరిగే విషయాలను నేను బయటికి చెప్తున్నాను అన్న అనుమానంతో నన్ను వేధిస్తోంది. తోటి ఉపాధ్యాయులు నాతో మాట్లాడకుండా ప్రిన్సిపల్ మేడం దూరం చేసింది. నా స్నేహితులతోనే నన్ను అవమానపరిచింది. ఆ అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నా. నా మరణం తర్వాత నా కుటుంబానికి, నా పిల్లలకి పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ నిర్మల’ అని బయాలజీ టీచర్ జ్యోతి లేఖలో పేర్కొన్నారు.
Also Read: Kinjarapu Atchannaidu: దండయాత్ర చేస్తానంటే ఊరుకోము.. వైఎస్ జగన్‌కు మంత్రి హెచ్చరిక!
‘పాఠశాలలో ఇంకా చాలా దారుణాలు జరుగుతున్నాయి కానీ.. రాసే అంత శక్తి నాకు లేదు. పాఠశాలలో ప్రిన్సిపాల్ మేడంకు నచ్చని టీచర్లను తొలగిస్తుంది. లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తుంది.. పిల్లలతో బ్యాడ్ గా లెటర్స్ రాయిస్తుంది. విచారణకు వచ్చిన అధికారులు ప్రిన్సిపల్ మాటలను నమ్మి నిజాలను తేల్చకుండా వెళ్లిపోతున్నారు. నిజానికి స్కూల్లో జరిగేది ఒకటి, బయటకు కనిపించేది వేరుగా ఉంది. స్కూల్లో ప్రత్యేక వంటలు చేయించుకుని తినటం నిజమే. మా సెక్రెటరీ మేడంకు, డీఎస్ మేడంకు ఈ విషయాలు తెలియద్దు.. ప్రిన్సిపల్ చెప్పే మాటల్లో నిజమని నమ్ముతున్నారు. డీఎస్ మేడం, సెక్రెటరీ మేడంలు ప్రిన్సిపల్ నిజస్వరూపం తెలుసుకుంటారని నమ్ముతున్నాను. ఉన్నత అధికారులు చర్యలు తీసుకోని వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపాల్ మేడంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని టీచర్ జ్యోతి లేఖలో రాసుకొచ్చారు.