వైఎస్‌ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని వనిపెంట గురుకుల పాఠశాలలో ఓ మహిళా టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రిన్సిపల్ మేడమ్ నిర్మల వేధింపులు తాను భరించలేనని బయాలజీ టీచర్ జ్యోతి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. సకాలంలో తోటి టీచర్స్ చూడడంతో.. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. టీచర్ జ్యోతిని మెరుగైన వైద్యం కోసం కడపకి తరలించారు. టీచర్ జ్యోతి తన ఆత్మహత్యకు గల కారణాలను లేఖలో రాశారు. వనిపెంట గురుకుల పాఠశాలలో జరిగే విషయాలు అన్నింటినీ చెప్పి.. ప్రిన్సిపల్…