NTV Telugu Site icon

Vangalapudi Anitha: విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చినట్లుంది.. హోంమంత్రి సెటైర్లు

Anitha

Anitha

విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో దావోస్‌లో 4 సార్లు సమ్మిట్ జరిగితే ఒక్కసారి వెళ్ళొచ్చారని వంగలపూడి అనిత ఆరోపించారు. తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లాడి లాగా బిత్తర చూపులు చూస్తూ.. ఇట్స్ లెంగ్త్ క్వషన్ అన్నారని పేర్కొన్నారు. మానసికంగా క్షోభ అనుభవిస్తున్న పిల్లలపై కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం తగదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తాము అమలు చేస్తే.. వైసీపీ వాళ్ళు ఈ 7 నెలలలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని హోంమంత్రి అనిత తెలిపారు.

Read Also: Vijayawada: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం..

ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి తత్వం బోధపడిందని ఆరోపించారు. విజయసాయి రెడ్డికి ఆయన చేసిన పాపాలు కలలో కూడా గుర్తు వస్తూ ఉన్నట్లు ఉన్నాయి.. ఆయన వ్యవసాయం చేస్తే పచ్చని ప్రకృతి కూడా కలుషితం అవుతుందని విమర్శించారు. విశాఖ నగరాన్ని నాశనం చేసిన వ్యక్తి విజయ సాయి రెడ్డి.. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబాన్ని దూషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని దుయ్యబట్టారు. ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Read Also: భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఎలా దొరికాయంటే ?