తెలుగు ప్రజలకు కేంద్రం సంక్రాంతి కానుకను అందజేయనుంది. జనవరి 15న సికింద్రాబాద్- విశాఖపట్టణం వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 19న కార్యక్రమం జరగాల్సి ఉన్నప్పటికీ పండగ సమయంలో తెలుగు ప్రజలకు కానుకను ఇచ్చేందుకు నాలుగురోజులు ముందే ఈ రైలు ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. 15వ తేదీ ఉదయం 10 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
Also Read : Warangal Bus Station : వరంగల్ వాసులకు గుడ్‌న్యూస్.. ఆధునిక బస్ స్టేషన్ కోసం రూ.75 కోట్లు విడుదల
దేశంలోని 8వ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా దాదాపు 8 గంటల్లో విశాఖపట్టణం చేరుకోనుంది. ఇదిలా ఉంటే.. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా ఈరోజు వైజాగ్ కు వందేభారత్ రైలు చేరుకుంది. అయితే.. ఈ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది రాళ్ల దాడేనని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు నిర్ధారించారు. మరోవైపు ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు. నిందితుల కోసం గాలిస్తున్నా రైల్వే పోలీసులు.