సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటన్నర ఆలస్యంగా బయలుదేరనుందని రైల్వే అధికారులు ప్రకటించారు. నేడు పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో వందేభారత్ సైతం ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఇవాళ ఒక్క రోజు మాత్రమే షెడ్యూల్లో మార్పు ఉంటుందని తెలిపారు రైల్వే అధికారులు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ అనగా మార్చి 14వ తేదీన సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుందన్నారు.
Also Read : Sithara entertainments: కలిసొచ్చిన మాసంలో కనక వర్షం!
రేపటి నుంచి యధావిధిగా మధ్యాహ్నం 3 గంటలకు వందే భారత్ రైలు బయలుదేరుతుందని వివరించారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతోందని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించవల్సిందిగా రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Also Read : Viral News : భార్య నిద్ర.. భర్త పోలీస్ కంప్లైంట్
ఇదిలా ఉంటే.. నిన్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలో ఓ ఎద్దును వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. రైలును ఘటనాస్థలంలోనే నిలిపివేసి మరమ్మతు చేపట్టారు.