Site icon NTV Telugu

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పూర్తి.. 20 కేజీలు తగ్గారని భార్య వెల్లడి..!

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

వల్లభనేని వంశీ రెండు రోజుల కస్టడీ పూర్తి అయింది.. బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నమోదైన కేసుకి సంబంధించి వంశీని రెండ్రోజుల పాటు పోలీసులు విచారించారు. వంశీని 30కిపైగా ప్రశ్నలు అడిగారు. నకిలీ ఇళ్ల పట్టాలను ఎక్కడ ఎవరు ఎందుకు తయారు చేసారని వంశీని పోలీసులు ప్రశ్నించారు. నకిలీ ఇళ్ల పట్టాల తయారీలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయాల్ని అడిగారు. తనకు నకిలీ పట్టాలతో సంబంధం లేదని వంశీ సమాధానం చెప్పారు. వంశీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో సరిగ్గా విచారణ చేయలేదని పోలీసులు చెబుతున్నారు.

READ MORE: Pawan Kalyan: టార్గెట్ హరిహర .. డిప్యూటీ సీఎం ఆఫీస్ సంచలన ప్రకటన!

కస్టడీ అనంతరం వంశీని నూజివీడు కోర్టు నుంచి విజయవాడ సబ్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా వంశీ భార్య పంకజ శ్రీ మాట్లాడారు. “వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సీ క్యాప్ తో మాత్రమే శ్వాస తీసుకునే పరిస్థితి లో ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం పూర్తి స్థాయిలో అందటం లేదు. ఎయిమ్స్ వంటి మెరుగైన ఆసుపత్రిలో వైద్యం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాం. 105 కిలోల నుంచి 85 కిలోలకి బరువు తగ్గిపోయారు.” అని పేర్కొన్నారు.

READ MORE: Perni Nani: అధికారంలోకి రాగానే మాట మార్చేశారు..? పవన్‌ కల్యాణ్‌పై పేర్నినాని ఫైర్‌..

Exit mobile version