Vakkantham Vamsi : ఆ ముగ్గురు స్టార్ హీరోల వల్ల నా జీవితం మారిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్కంతం వంశీ…ఈ పేరు టాలీవుడ్ లో తెలియని వారు వుండరు. రైటర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిఆ తరువాత దర్శకుడుగా మారి తనకంటూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు ఆయన.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకను తెరకెక్కించారు వక్కంతా వంశీ. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయన తన కెరీర్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. నేను ఎన్నో సినిమాలకు కథను అందించిన రచయితగా మాత్రమే ఇండస్ట్రీ లో అందరికి తెలుసు. నా జీవితంలో కేవలం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మాత్రమే కాదు ముగ్గురు స్టార్ హీరోల వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు వక్కంతం వంశీ.నేను ముందు నుంచి రైటర్ గానే పనిచేశాను కిక్ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అందులో డైలాగ్స్ కానీ ఆ సినిమాలోని పాత్రలు కానీ నన్ను ఎంతగానో ప్రభావితం చేసాయి.ఆ సినిమా నాకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది.రవితేజ గారు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు వంశీ.
ఇక ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని వంశీ తెలిపారు.నా గురించి ఎన్టీఆర్ కు పూర్తిగా తెలుసు కాబట్టి నన్ను దర్శకుడుగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ ఎంతగానో అనుకున్నాడని తనే నన్ను సినిమా కథ రాయమని ఆ సినిమాలో తానే హీరోగా నటిస్తానని చెప్పి మాట కూడా ఇచ్చాడని చెప్పుకొచ్చారు వంశీ.కానీ ఎన్టీఆర్ కు తగ్గ కథ రాయడానికి నేను రెండు నుంచి మూడేళ్ల వరకు సమయం తీసుకున్నానని ఆ కథ ఏ రకంగానూ ముందుకు సాగక పోవడంతో ఆ కథను మధ్యలోనే వదిలేసాను. మరొక సినిమా ఏదైనా చేసి ఆ తర్వాత మళ్లీ ఎన్టీఆర్ కోసం మొదలు పెట్టిన కథను పూర్తి చేయాలని భావించాను.ఆ సమయంలో నల్లమలుపు బుజ్జి ద్వారా అల్లు అర్జున్ గారిని కలిసి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ చెప్పడం జరిగింది ఆ కథ ఓకే కావడం ఆ సినిమాతో అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయడం జరిగిపోయింది. ఇలా రవితేజ,ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ నా జీవితాన్ని టర్న్ చేసారని వంశీ చెప్పుకొచ్చారు.. భవిష్యత్ లో ఎన్టీఆర్ తో కచ్చితంగా సినిమా చేస్తాను అని ఆయన తెలిపారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!