Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో ఎవరు బలి అవుతారు?

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో 776 పరుగులు, 237+ స్ట్రైక్ రేట్, 72 సిక్సర్లు బాది ఆరెంజ్ క్యాప్‌తో పాటు 5 అవార్డులు గెలుచుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా ఎంట్రీపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ నడుస్తోంది. బుమ్రా, కమిన్స్ లాంటి బౌలర్లను సైతం ఊచకోత కోసిన వైభవ్‌ను నెట్స్‌లో ఎదుర్కోవడానికే భయపడతానని తోటి ఆటగాడు జోఫ్రా ఆర్చర్ అనడం, అలాగే సచిన్, కోహ్లీ, గిల్, అజయ్ జడేజాల ప్రశంసలు అతని రేంజ్‌ను చెప్తున్నాయి. అయితే.. వైభవ్ జట్టులోకి వస్తే 2026 మార్చి 8న అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన ప్రస్తుత టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి ఎవరిని తీసేస్తారు? అనేది ఇప్పుడు ప్రశ్న. 2027 వరల్డ్ కప్ వరకు వన్డేల్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు కాబట్టి, వైభవ్ టీ20 ఎంట్రీ లేదా వన్డేల్లో బ్యాకప్ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ టీ20ల్లో ఓపెనర్‌గా రావాలంటే.. వరల్డ్ కప్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా, టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి, కీపర్‌గా ఉన్న సంజు శాంసన్‌ను గానీ, లేదా వరల్డ్ కప్‌లో విఫలమైనా.. ఫైనల్లో 21 బంతుల్లో 52 రన్స్ చేసి, ప్రస్తుతం ఐసీసీ నంబర్ 1 టీ20 బ్యాటర్‌గా ఉంటూ, ఇటీవలి ఐపీఎల్‌లో 563 రన్స్ చేసిన అభిషేక్ శర్మను గానీ పక్కన పెట్టాలి.

ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ నేతృత్వంలో జరిగే సెలెక్షన్ కమిటీ సమావేశం అత్యంత కీలకం కానుంది. ఇందులో జూన్ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో జరిగే ఐర్లాండ్ సిరీస్‌తో పాటు జూలైలో ఇంగ్లాండ్ టూర్, సెప్టెంబర్-అక్టోబర్‌లో జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. ఒకవేళ వైభవ్ గనుక జూన్ ఐర్లాండ్ సిరీస్‌లోనే ఎంపికైతే… సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, భారతదేశం తరఫున అత్యంత చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాడిగా నిలుస్తాడు. ఒకవేళ ఐర్లాండ్ కాకపోతే, ఐఓఏ (IOA)కి బీసీసీఐ పంపిన 30 మంది ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ పేరు ఉంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే వెస్టిండీస్ పర్యటన, సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ఏషియన్ గేమ్స్ ఒకే సమయంలో ఉండటంతో సెలెక్టర్లు రెండు వేర్వేరు టీ20 జట్లను ఎంపిక చేయాల్సి వస్తోంది. వన్డే కెప్టెన్సీ బాధ్యతల వల్ల గిల్‌తో పాటు టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌లకు ఏషియన్ గేమ్స్ లిస్టులో చోటు దక్కలేదు కాబట్టి, వైభవ్ నేరుగా ఏషియన్ గేమ్స్ ద్వారానే అంతర్జాతీయ క్రికెట్‌లోకి లాంచ్ అయ్యే అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయి. ఏదేమైనా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం మొదలవ్వడం ఖాయం, కానీ అదే సమయంలో వరల్డ్ కప్ గెలిచిన జట్టు నుంచి ఎవరు త్యాగం చేయాల్సి వస్తుందనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది!

×
×
Ad