Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సూపర్ స్టార్.. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ టీ20 అరంగేట్రానికి సిద్ధమవుతున్న వేళ, అతడిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఐర్లాండ్ జట్టు ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ 26న జరగనున్న భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌లో వైభవ్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ 2026లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్, ప్రపంచ స్థాయి బౌలర్లపై సైతం దూకుడుగా ఆడుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. దీంతో అతడిని అడ్డుకోవడానికి ఐర్లాండ్ బౌలర్లు ముందుగానే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
ఐర్లాండ్ యువ ఎడమచేతి వాటం స్పిన్నర్ మాథ్యూ హంఫ్రీస్ మాట్లాడుతూ, వైభవ్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన యువ బ్యాట్స్మెన్లలో ఒకడని పేర్కొన్నాడు. అయితే, అతని ఆటతీరుపై సమగ్రంగా అధ్యయనం చేసి, స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగితే అతడిని కట్టడి చేయవచ్చని అభిప్రాయపడ్డాడు. 23 ఏళ్ల మాథ్యూ హంఫ్రీస్.. వైభవ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యువ బ్యాట్స్మెన్లలో ఒకడని అంగీకరిస్తూనే.. సరైన పరిశోధన, స్పష్టమైన ప్రణాళికతో అతనికి సవాలు విసరవచ్చని నమ్ముతున్నాడు.
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో విప్లవాత్మక మార్పులు.. టెస్ట్, వన్డే, టీ20లకు వేర్వేరు టీమ్స్..!
- Virat Kohli One8 Shoes: కోహ్లీ కొత్త బ్రాండ్ సంచలనం.. ఒక్క రోజులోనే కోట్ల రూపాయల బిజినెస్..
- Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
- Sachin Tendulkar Viral Video: వర్షంలో చిన్నపిల్లాడిగా మారిపోయిన సచిన్.. వైరల్‌గా మారిన వీడియో
టీ20 క్రికెట్లో, తమ బౌలింగ్‌లో సిక్సర్లు బాదే అవకాశం ఉందని బౌలర్లకు ముందే తెలుసు.. కాబట్టి ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. ఐపీఎల్లో గొప్ప బౌలర్ల బౌలింగ్‌లో సిక్సర్లు బాదుతూ.. సూర్యవంశీ అత్యంత విధ్వంసకరమైన టాప్-ఆర్డర్ బ్యాట్స్మెన్లలో ఒకడిగా తనను తాను నిరూపించుకున్నాడని పేర్కొన్నాడు హంఫ్రీస్.. అయితే, అతని బ్యాటింగ్‌పై పరిశోధన చేసి, ఒక స్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు..
ఇటీవల శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన వన్డే ట్రై-సిరీస్‌లో వైభవ్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కేవలం 11 బంతుల్లోనే సెంచరీ బాది లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకం నమోదు చేశాడు. ఫైనల్లో 29 బంతుల్లో 94 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ ప్రదర్శనతో అతడు అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు.
అయితే ట్రై-సిరీస్ సందర్భంగా ఆఫ్-స్పిన్, వేగంలోని మార్పులతో కూడిన బంతులకు వైభవ్ కొంత ఇబ్బంది పడినట్లు కనిపించింది. దీంతో ఐర్లాండ్ బౌలర్లు ఈ బలహీనతలను లక్ష్యంగా చేసుకునే అవకాశముంది. ఇదిలా ఉండగా, ఐర్లాండ్ జట్టు గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రెగ్యులర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌తో పాటు పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా సిరీస్‌కు దూరమయ్యారు. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న ఐర్లాండ్‌కు వైభవ్ సూర్యవంశీ వికెట్ అత్యంత కీలకంగా మారింది. మరోవైపు భారత అభిమానులు మాత్రం ‘బేబీ బాస్’ తన తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తాడని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
-
Passport Row: పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. కేంద్రం క్లారిటీ..
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!