Vaibhav Sooryavanshi: ‘బేబీ బాస్’కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్.. మ్యాచ్ నిర్వాహకులకు కొత్త సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ముందే ఐర్లాండ్‌లో భారీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్ వేదికగా భారత్-ఐర్లాండ్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ పేరు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతడిని భారత జెర్సీలో చూడాలనే ఆసక్తితో యూరప్ నలుమూలల నుంచి అభిమానులు బెల్ఫాస్ట్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. భారత, ఐర్లాండ్ మాజీ క్రికెటర్ ఎం.వి. నరసింహారావు ప్రకారం, వైభవ్ సూర్యవంశీపై నెలకొన్న ఆసక్తి కారణంగా స్టోర్మాంట్ క్రికెట్ గ్రౌండ్ మ్యాచ్‌ల టిక్కెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సుమారు 7,000 మంది ప్రేక్షకులు మాత్రమే కూర్చోగల ఈ మైదానంలో సీట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ అభిమానులతో పాటు ఫ్రాన్స్ రాజధాని పారిస్ సహా యూరప్‌లోని పలు నగరాల నుంచి కూడా క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారని నరసింహారావు తెలిపారు. దీంతో ప్రేక్షకుల కోసం సరిపడా ఏర్పాట్లు చేయడం నిర్వాహకులకు సవాలుగా మారే అవకాశం ఉంది. “బేబీ బాస్”గా గుర్తింపు పొందిన వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో వర్ధమాన తారగా నిలిచాడు. చిన్న వయస్సులోనే తన ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, ఇప్పుడు భారత జట్టులో అరంగేట్రం చేసే అవకాశంతో మరింత వార్తల్లో నిలిచాడు. తుది జట్టులో చోటు దక్కితే, ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్ అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్‌గా నిలవనుంది.
Also Read
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
వైభవ్ అరంగేట్రంపై కేవలం భారతదేశంలోనే కాదు, యూరప్ వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొనడం విశేషం. అతడిని మైదానంలో చూడాలనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తుండటంతో ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ జూన్ 26న, రెండో మ్యాచ్ జూన్ 28న బెల్ఫాస్ట్లో జరగనుంది. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?