Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు చూస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ తమ సొంత బ్యానర్ ‘GMB ఎంటర్టైన్మెంట్’ పతాకంపై సమర్పిస్తుండటం విశేషం. జూలై 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఫైనల్ కట్ చూసిన ప్రెజెంటర్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ సోషల్ మీడియా వేదికగా ఇచ్చిన అల్టిమేట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ కథను చెప్పిన మొదటి రోజు నుంచే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌తో ఎమోషనల్‌గా ట్రావెల్ అయ్యారు. కేవలం పేరుకే ప్రెజెంటర్‌గా కాకుండా.. సినిమా స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి అయ్యేంత వరకు ప్రతి విషయంలోనూ మహేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. తాజాగా ఎడిటింగ్ పూర్తి చేసుకున్న ఫైనల్ అవుట్‌పుట్ చూసిన సూపర్ స్టార్.. తాను నమ్మిన కంటెంట్ స్క్రీన్ పై అంతకంటే అద్భుతంగా రావడంతో థ్రిల్ అయ్యారు. చిత్ర యూనిట్ అంతా గర్వపడేలా సోషల్ మీడియాలో తన పర్సనల్ రివ్యూను పంచుకున్నారు.
Also Read
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
మహేష్ బాబు తన అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో రాస్తూ.. “రావు బహదూర్… ఇది కేవలం మీ కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు.. మీ బాడీలోకి, మీ స్కిన్ లోకి దూరిపోయే ఒక ఇంటెన్స్ ఎమోషన్!!! ఒక వింతైన, అందమైన, అత్యంత నాటకీయమైన సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు వెంకటేష్ మహా అద్భుతంగా సృష్టించాడు. ఇక ఆ ప్రపంచాన్ని నటుడు సత్యదేవ్ తన విశ్వరూపంతో పూర్తిగా ఆక్రమించేశాడు.. వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్! హీరోయిన్ దీపా థామస్ తన నటనతో స్క్రీన్ పై మెరిసిపోయింది. టెక్నికల్ టీమ్, మిగతా నటీనటులు సినిమాకు అండగా నిలిచారు. ఈ టీమ్ మొత్తాన్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. జూలై 3 నుంచి థియేటర్లలో ‘రావు బహదూర్’ సృష్టించబోయే ఆ Madness మీరు చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అంటూ హార్ట్ ఎమోజీలను షేర్ చేశారు.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!