Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి కొత్త ఆటగాళ్లు రాణించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పై పడింది.
వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి దగ్గరయ్యాడు. కేవలం 12 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్ లోనే సూర్యవంశీ 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ 228.28 చూస్తే వైభవ్ బౌలర్లపై ఎలా విరుచకపడుతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ దూకుడుతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన వైభవ్, ఐర్లాండ్ పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.
Also Read
Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..
ఇదే నిజమైతే.. కేవలం 15 ఏళ్ల వయసులోనే సూర్యవంశీ టీమ్ ఇండియాలోకి వస్తే, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి, భారత జట్టుకు ఆడిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ ను దక్కించుకుంటాడు. టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. అయితే, అతని ఎంపికలో ప్రధాన సమస్య టాప్ ఆర్డర్ లో చోటు కల్పించడం. ప్రస్తుతం టీమిండియాకు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ డ్యాషింగ్ ఓపెనర్లు ఉండనే ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ 2026 విజయానంతరం వీరు జట్టుకు మరింత కీలకంగా మారారు.
Nari Shakti Vandan Bill: సీఎం క్యాంప్ కార్యాలయంలో కీలక భేటీ.. చంద్రబాబు లేఖలు, ఎన్డీఏ కూటమి చర్చలు.!
అయితే సాధారణంగా ఐర్లాండ్ పర్యటనలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, కొత్త ఆటగాళ్లను పరీక్షించే అవకాశం బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లకు రెస్ట్ ఇస్తే సూర్యవంశీ ఓపెనర్ గా ఆడే అవకాశం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతి త్వరలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ కెరియర్ లో భారీ మార్పులు రానున్నాయి. చుడాలిమరి సెలెక్టర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో..
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!