Vaibhav Sooryavanshi: వైభవ్ బ్యాట్ చెక్ చేసిన ఆర్సీబీ వికెట్ కీపర్ జితేష్ శర్మ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఊచకోత కోశాడు. వరుసు బౌండరీలతో బౌలర్లకు చెమటలు పట్టించాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెన్సేషన్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మతో సరదాగా గడిపాడు. ఈ తరుణంలో జితేష్ వైభవ్ బ్యాట్ తీసుకుని చెక్ చేయడం ఆసక్తికరంగా మారింది. జితేష్, వైభవ్ బ్యాట్‌ను ఆటపట్టించడంతో వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ MORE: Vaibhav Sooryavanshi: మొన్న బుమ్రా, నిన్న భువనేశ్వర్.. స్టార్ బౌలర్లకు చెమటలు పట్టిస్తున్న వైభవ్..
Also Read
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
వీడియోలో ఏముందంటే..?
ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ సరదాగా వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్లాడు. బ్యాట్ ఇవ్వమని అడిగాడు. దాన్ని పట్టుకుని చూశాడు. ఇక ఆ బ్యాట్ తీసుకుని థ్యాంక్యూ అని చెబుతూ అక్కడి నుంచి వెళ్లబోయాడు. వెంటనే ఈ కుర్రాడు “ఓ భాయ్.. నా బ్యాట్ నాకు ఇవ్వు. దీని గురించి తర్వాత మాట్లాడదాం” అని తన బ్యాట్‌ను తీసుకున్నాడు వైభవ్. అంతేకాదు.. “మీ టీమ్‌లో చాలా మంది స్టార్ బ్యాటర్లు ఉన్నారు. వారిని అడగకుండా నా బ్యాట్ ఎందుకు అడుగుతున్నారు?” అని ప్రశ్నించాడు. సరదాగా స్పందించిన జితేష్ తాను ఎవరినీ బ్యాట్ అడగలేదని, కేవలం వైభవ్ బ్యాట్ మాత్రమే కావాలని కోరాడు. ఐపీఎల్ ముగిశాక బ్యాట్ ఇచ్చేస్తానని సూర్య వంశీ చెప్పాడు. “నేను మీకు ముందే చెప్పా. ఐపీఎల్ అయిపోయిన వెంటనే నా బ్యాట్ మీకు ఇచ్చేస్తాను. కానీ ఇప్పుడు కావాలని పట్టుబట్టడం ఏంటి?” అని వైభవ్ అన్నాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
🚨 First time ever: Vaibhav offers to give his bat! 😂🔥 pic.twitter.com/y5pBnpEri3
— Rajasthan Royals (@rajasthanroyals) April 9, 2026
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్‌లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్‌తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!