వన్డే ప్రపంచకప్ 2027లో Vaibhav Sooryavanshi.. భారత మాజీ స్పిన్నర్ కీలక వ్యాఖ్యలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన 15 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా ఈ బుడ్డోడు అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక చర్చకు కేంద్రబిందువయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రెండో మ్యాచ్ ద్వారా భారత జట్టుకు అరంగేట్రం చేసిన ఈ యువ ఆటగాడిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అతడిని భవిష్యత్ వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని మాజీ స్పిన్నర్ ‘లక్ష్మణ్ శివరామకృష్ణన్’ అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అదే ప్రదర్శన అతడికి భారత జట్టులో చోటు కల్పించింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం చేసిన వైభవ్ 10 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసినప్పటికీ.. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో తన సత్తా ఏంటో రుచిచూపించాడు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
అయితే ప్రస్తుతం టీ20 జట్టులో వైభవ్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలా.? లేక మూడో టీ20లో మళ్లీ సంజూ శాంసన్‌ను ఆడించాలా.? అనే చర్చ కొనసాగుతోంది. అయితే ఇప్పుడు లక్ష్మణ్ శివరామకృష్ణన్ మాత్రం మరో ఆసక్తికర విషయాన్నీ తెరపైకి తెచ్చారు. టీ20 ఫార్మాట్లో వైభవ్ అసాధారణ ప్రదర్శన కొనసాగిస్తే అతడిని 2027 వన్డే ప్రపంచకప్‌కు కూడా పరిశీలించాలని సెలెక్టర్లకు సూచించారు. టీ20ల్లో అతడు అద్భుతంగా రాణిస్తే.. రాబోయే 50 ఓవర్ల ప్రపంచకప్‌లో అవకాశం ఇవ్వాలి. అతడు మ్యాచ్ విన్నర్‌గా మారే సామర్థ్యం కలిగిన ఆటగాడు అంటూ శివరామకృష్ణన్ పేర్కొన్నారు.
వైభవ్ సూర్యవంశీ వన్డే ఫార్మాట్లో కూడా మంచి రికార్డును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 25 యూత్ వన్డే మ్యాచ్‌లు ఆడిన అతడు 56.48 సగటుతో 1,412 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై 175 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ తో ప్రపంచ కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
అంతేకాకుండా భారత ‘A’ జట్టుతో కలిసి శ్రీలంకలో జరిగిన ట్రై-సిరీస్‌లో కూడా వైభవ్ ఆకట్టుకున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లో 200.95 స్ట్రైక్‌రేట్‌తో 211 పరుగులు చేసి 42.20 సగటును నమోదు చేశాడు. అయితే ప్రస్తుతం అతడిని నేరుగా ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవడం తొందరపాటు నిర్ణయం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అతడి ప్రతిభ, నిలకడను దృష్టిలో ఉంచుకుంటే త్వరలోనే భారత వన్డే జట్టులో అవకాశం ఇవ్వడం మాత్రం ఆశ్చర్యకరమైన విషయం కాదని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!