Bhuvneshwar Kumar: “మేము బాధపడటం లేదు”.. వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌పై భువనేశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuvneshwar Kumar: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. వైభవ్ కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి 300 స్ట్రైక్ రేట్‌తో ఆర్సీబీ బౌలింగ్ విభాగాన్ని చిన్నాభిన్నం చేశాడు. 15 ఏళ్ల కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ చూసి అనుభవజ్ఞుడైన బౌలర్లు షాక్ అవుతున్నారు. ఇక స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను సైతం వైభవ్ విడిచిపెట్టలేదు. ఈ విధ్వంసరకర బ్యాట్స్‌మెన్ గురించి మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ మాట్లాడాడు. టీ20లో వయసుతో సంబంధం లేదని భువీ అన్నాడు. ఇలాంటి ఇన్నింగ్స్ సహజమే అని చెప్పుకొచ్చాడు. ఈ కుర్రాడు చాలా బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. తన బౌలింగ్‌లో ఓ 15 ఏళ్ల కుర్రాడు కొట్టాడని తాము బాధపడటం లేదన్నాడు.
READ MORE: Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
తాము వేసిన ప్లాన్స్‌ను సరిగ్గా అమలు చేయలేకపోయామని భువీ ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక క్యాచ్ మిస్ అయ్యిందని గుర్తు చేశాడు. ఇక ఈ 15 ఏళ్ల కుర్రాడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ కొనియాడాడు. ఆర్సీబీ బౌలింగ్ వ్యూహాల గురించి వివరణ ఇచ్చాడు. పవర్‌ప్లేలో స్పిన్నర్లను వాడటం కష్టమని, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల సుయాష్‌ను తీసుకోలేకపోయామని చెప్పాడు. కేవలం ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మాత్రమే ఉండటంతో వైభవ్‌ను కట్టడి చేయడం సాధ్యం కాలేదని భువీ అంగీకరించాడు. వైభవ్ బ్యాటింగ్ శైలి గురించి భువీ మాట్లాడుతూ.. “అతను కేవలం బంతిని బలంగా బాదడమే (Slogging) కాకుండా, సరైన క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. ఆ వయసులో అంత మెచ్యూరిటీ ఉండటం గొప్ప విషయం” అని కొనియాడాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నిన్న(శుక్రవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వైభవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మరోవైపు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63 పరుగులు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 201 పరుగుల భారీ స్కోరును అందించాడు. విరాట్ కోహ్లీ (32), రోమారియో షెపర్డ్ (22), వెంకటేష్ అయ్యర్ (29) కూడా తమ వంతు సహకారం అందించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మలు తలో రెండు వికెట్లు తీసి ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆధారంగా, రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!