యంగ్ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్‍తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన అవికా గోర్. ఆ తర్వాత 2013లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది..ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాల లో నటించి మెప్పించింది… అయితే, నటనపరంగా ప్రశంసలు అందుకున్నా కూడా టాప్ హీరోయిన్ గా అవికా ఎదగలేకపోయారు . ప్రస్తుతం ఆమె వరుసగా ఓటీటీ సిరీస్‍లు చేస్తున్నారు.. ఇటీవల మ్యాన్షన్ 24 అనే హారర్ థ్రిల్లర్ సిరీస్‍లో అవికా గోర్ నటించింది..ఆ సిరీస్ లో అవికా కనిపించింది కొంచెం సేపే అయినా కానీ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అవికా ప్రధాన పాత్రలో ‘వధువు’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్‍కు సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదల అయింది.
వధువు వెబ్ సిరీస్ త్వరలో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వధువు సిరీస్ ఫస్ట్ లుక్‍ను నేడు ఆ ప్లాట్‍ఫామ్ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‍లో పెళ్లికూతురుగా అవికా గోర్ కనిపించింది పెళ్లి దుస్తులు, బాసికం కట్టుకున్న అవికా గోర్ ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టుగా వధువు ఫస్ట్ లుక్ ఉంది. మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ తెరకెక్కింది..ఈ సిరీస్‍లో బిగ్‍బాస్ ఫేమ్ అలీ రెజా మరియు నందు కూడా కీలకపాత్రలు చేస్తున్నారు. వధువు వెబ్ సిరీస్ కూడా థ్రిల్లర్ జానర్ లోనే ఉండనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‍ను డిస్నీ+ హాట్‍స్టార్ ప్రకటించనున్నారు..వధువు సిరీస్‍ను ఎస్‍వీఎఫ్ సోషల్ పతాకంపై అభిషేక్ దాగా నిర్మిస్తున్నారు.తాను త్వరలో ఓ సిరీస్ చేస్తున్నానని ‘వధువు’ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో హింట్ ఇచ్చారు అవికా గోర్. ఇప్పుడు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ వచ్చింది.