కోనసీమ తిరుమలగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వ్యక్తి హాల్‌చల్ చేశాడు. ఆలయం లోపల గాలిలో పేల్చే డమ్మీ పిస్టల్‌తో అతడు హాల్‌చల్ చేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆలయ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై.. హడావుడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి వద్ద నుంచి డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. డమ్మీ పిస్టల్ కలిగిన వ్యక్తి కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన జానా వెంకట మహేంద్రగా గుర్తించారు.
Also Read: AP News: కుప్పం ప్రాంత అభివృద్ధి కోసం సీఎం సమక్షంలో 6 ఎంఓయూలు!
ఆత్రేయపురం పోలీసులు వెంకట మహేంద్రను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. సదరు వ్యక్తి గతంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులోని జవాన్‌గా పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. భక్తులతో కిక్కిరిసిన ఆలయంలో త్వరగా స్వామివారి దర్శనం కోసం డమ్మీ పిస్టల్ తీసుకొని వచ్చాడా? లేదా ఏదైనా ఉద్దేశపూర్వకంగానే భక్తులను భయభ్రాంతులకు గురి చేయాలనే తీసుకొచ్చాడా? అనే కోణాల్లో. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేంద్రతో పాటు వచ్చిన మరో వ్యక్తి రావులపాలెం మండలం దేవరపల్లికి చెందిన నున్న నాగ చందును కూడా పోలీసులు విచారిస్తున్నారు.