కోనసీమ తిరుమలగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఓ వ్యక్తి హాల్‌చల్ చేశాడు. ఆలయం లోపల గాలిలో పేల్చే డమ్మీ పిస్టల్‌తో అతడు హాల్‌చల్ చేయడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. ఆలయ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమై.. హడావుడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతడి వద్ద నుంచి డమ్మీ పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు. డమ్మీ పిస్టల్ కలిగిన వ్యక్తి కృష్ణా జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నంకు చెందిన జానా వెంకట…