Chiranjeevi :మెగాస్టార్ చిరంజీవి ,టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్రేజీ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఠాగూర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఆ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం చూపించారు.అలాగే రాజకీయాలను వదిలి సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన చిరంజీవి తన మొదటి మూవీ వినాయక్ తో చేయడం విశేషం.వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ ఖైదీ నెం.150 ఈ సినిమాతో చిరంజీవి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
Read Also :Kalki 2898AD : షాకింగ్ న్యూస్.. కల్కి టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే?
ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి “విశ్వంభర” అనే సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాను బ్లాక్ బస్టర్ మూవీ బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుండగా సెట్స్ కు వి.వి.వినాయక్ వెళ్ళాడు.విశ్వంభర చిత్ర యూనిట్ కు వినాయక్ బెస్ట్ విషెస్ తెలియజేసారు.విశ్వంభర సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆషికా రంగనాథన్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వీ. వంశీకృష్ణ రెడ్డి , ప్రమోద్ ఉప్పలపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.